Bandi Sanjay : ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ హైడ్రా : కేంద్రమంత్రి బండి సంజయ్
ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ హైడ్రా : కేంద్రమంత్రి బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంగా మారింది అని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శిలు గుప్పించారు. మీడియాతో మాట్లాడతూ మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల అవినీతికి తెర లేపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక హైడ్రా పేరుతో డ్రామాలుఆడి అవినితి చేస్తు పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేస్తుంది.
Bandi Sanjay Comment
పేదల ఇండ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా.. బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుంది.హైడ్రా మానవత్వం కోణంలో ఆలోచించాలి. ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ అక్రమాలకు తెర లేపారు.వారసత్వ, కుటుంబ పార్టీలను బొందపెట్టే సమయం ఆసన్నమైంది.వారసత్వ రాజకీయాలకు బీజెపీ దూరం.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని బండిసంజయ్ హెచ్చరించారు.
Also Read : HYDRA-Musi : మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్దమైన ‘హైడ్రా’