Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స
సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స
Superstar Rajinikanth: చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజినీకాంత్‌కి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు చెప్పాయి. వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం. మరి కాసేపట్లో రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించనున్నారు.
Superstar Rajinikanth Health Update
గతంలో రజినీకాంత్ మెదడు రక్తనాళంలో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడటంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు చికిత్స చేసి వాటిని తొలగించారు. మెదడు రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. వాటిని తొలగించి మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరిగేలా చికిత్స అందించారు. ఆ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రజినీకాంత్(Superstar Rajinikanth) మెదడు రక్తనాళంలో ఉన్న అడ్డంకులను తొలగించి, యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేశారు. అలాగే దీంతో పాటు రజినీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలు చేశారు.
రజినీకాంత్ హాస్పిటల్లో చేరారనే వార్తలు బయటకు రావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెట్టయాన్, కూలి వంటి చిత్రాల్లో రజినీకాంత్ నటిస్తున్నారు. ఇటీవలే వెట్టయాన్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 10న వెట్టయాన్ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వెట్టయాన్‌లో విలన్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు.. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Also Read : Bandi Sanjay : ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ హైడ్రా : కేంద్రమంత్రి బండి సంజయ్