AP Rains : రానున్న 4 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లతోపాటు హెల్ప్ లైన్‌లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు...

AP Rains : ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. ఈ రోజు కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదే సమయంలో కోస్తా తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటలల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి జల్లు కురిసే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహాణ శాఖ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

AP Rains Update

రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లతోపాటు హెల్ప్ లైన్‌లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఇక మత్స్యకారులు ఎవరు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. మరోవైపు ఇదే అంశంపై ఆదివారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. అలాగే విపత్తు నిర్వహాణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సైతం.. భారీ వర్షాల వేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అదే విధంగా హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఆయన వివరించారు.

Also Read : Jammu Kashmir CM : జమ్మూ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఒమర్ అబ్దుల్లా

Leave A Reply

Your Email Id will not be published!