NIA : ఆ గ్యాంగ్ స్టార్ అన్మోల్ ను పట్టుకున్న వారికి 10 లక్షల రివార్డు – ఎన్ఐఏ

ఇప్పటికే ఇతను ఓ కేసులో దోషిగా తేలగా బెయిల్‌పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్నాడు...

NIA : జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఈ మేరకు అతనిపై రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్(Anmol Bishnoi) కూడా పేరు మోసిన గ్యాంగ్ స్టర్. ఇప్పటికే ఇతను ఓ కేసులో దోషిగా తేలగా బెయిల్‌పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్నాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులోనూ అతనిపై అభియోగాలు ఉన్నాయి. అలాగే ఇటీవల సంచలనం రేపిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ, కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులతోపాటు మెుత్తం 17కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. జోధ్‌పూర్‌లో ఓ కేసులో దోషిగా తేలడంతో అతనికి జైలు శిక్ష కూడా పడింది. అయితే 2021 అక్టోబర్ 7న విడుదల అన్మోల్ బిష్ణోయ్ అప్పట్నుంచీ దేశం విడిచి పారిపోయాడు. కెన్యా, కెనడా సహా వివిధ దేశాలకు తిరుగుతూ పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ నేపథ్యంలో అతనిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చుతూ రూ.10లక్షల రివార్డును ఎన్ఐఏ(NIA) ప్రకటించింది.

NIA Announce..

ఈ ఏడాది ఏప్రిల్ 24న అర్ధరాత్రి ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్ అలియాస్ నహ్వీ, గౌరవ్ భాటియా, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్, దీపక్ హవా సింగ్ అలియాస్ జాన్‌లను అరెస్టు చేశారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కాల్పుల ఘటనకు ముందు నిందితులతో తొమ్మిది నిమిషాలపాటు సంభాషించినట్లు పోలీసులు గుర్తించారు. దాడికి ముందు షూటర్లను రెచ్చగొట్టేలా, ధైర్యం నింపేలా అన్మోల్ వారితో మాట్లాడినట్లు విచారణలో తేల్చారు.

సల్మాన్ ఖాన్ ప్రతి కదలికలను ట్రాక్ చేసేందుకు ఆయన ఇంటి చుట్టుపక్కల, వివిధ ప్రదేశాల్లో దాదాపు 60 నుంచి 70 మంది నిరంతరం రెక్కీ నిర్వహించేవారని విచారణలో తేలింది. ముంబైలోని సల్మాన్ నివాసం, పన్వెల్ ఫామ్‌హౌస్, గోరేగావ్ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లోనూ నిఘా పెట్టారని గుర్తించారు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించేందుకే బాబా సిద్ధిఖీని సైతం హతమార్చినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడడంతో అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ(NIA) రివార్డు ప్రకటించింది.

Also Read : IND vs NZ : మరోసారి క్రికెట్ లవర్స్ ను నిరాశ పరిచిన టీమిండియా కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!