IPL 2025 : 2025 ఐపీఎల్ వేలంలో ఖరీదైన ఆ ఐదుగురు ప్లేయర్లు వీరే
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఒకే ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు...
IPL 2025 : ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. వేలానికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలి. ఇందుకోసం 10 జట్లకు అక్టోబర్ 31 వరకు బీసీసీఐ(BCCI) గడువు ఇచ్చింది. ఈ తేదీ దగ్గర పడుతుండటంతో, రిటైన్ చేయాల్సిన ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(Rohit Sharma), రిషబ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈసారి వేలంలోకి వస్తారని రూమర్స్ రావడంతో ఫ్రాంచైజీలు అలెర్టవుతున్నాయి. ఆటగాళ్లను వేలంలోకి వెళ్లనీయకుండా అట్టిపెట్టుకోవడానికి భారీ ఒప్పందాలను చేసుకుంటున్నాయి. ఈ వేలంలో దాదాపు రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి రిటైన్ చేసుకోగల ఆటగాళ్లెవరో చూద్దాం..
IPL 2025 Auction Updates
1. విరాట్ కోహ్లీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఒకే ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. 2008 ప్రారంభ సీజన్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో భాగమైన కోహ్లీ వారితోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్(IPL)లో ఆల్ టైమ్ అత్యధిక పరుగుల స్కోరర్ అయిన కోహ్లీని రూ. 20 కోట్లకు రిటైన్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2018లోనే రూ.18 కోట్లు వెచ్చించి ఆర్సీబీ ఈ ఆటగాడిని రిటైన్ చేసుకుంది. ఇది అప్పటి రిటెన్షన్ అమౌంట్ కంటే రూ.2 కోట్లు ఎక్కువ. ఇన్నేళ్ల పాటు విధేయత చాటుకున్న కోహ్లీకి ఆర్సీబీ ఈ సారి కూడా భారీ మొత్తం ఆఫర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చే చాన్స్ ఉంది.
2. రిషభ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టును వదిలి వేలంలోకి వస్తున్నట్టుగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. పంత్ తన తొలి సీజన్ అయిన 2016 నుండి డీసీ(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్)లో భాగంగా ఉన్నాడు. వేలానికి వెల్లకుండా ఈ ప్లేయర్ ను అట్టిపెట్టుకోవడానికి డీసీ రికార్డు స్థాయిలో రూ.20 కోట్లు చెల్లించడానికి కూడా వెనకాడకపోవచ్చు.
3. శ్రేయాస్ అయ్యర్
ఈ సంవత్సరం ప్రారంభంలో తన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయినప్పటికీ, ఐపీఎల్ విజేత శ్రేయర్ అయ్యర్ టోర్నమెంట్లో బెస్ట్ ఆప్షన్స్‌లో ఒకడిగా ఉన్నాడు. పదేళ్ల పాటు టైటిల్ కోసం ఎదురుచూసిన కేకేఆర్ జట్టు కల నిజం చేయడంలో ఈ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఇతడిని జట్టు అట్టిపెట్టుకుంటుందనే విషయంలో సందేహంలేదు. కొత్త ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు గాలిస్తున్న నేపథ్యంలో అయ్యర్ ను కేకేఆర్ వదులుకునే అవకాశాలు కనిపించడంల లేదు. ఈ ప్లేయర్ రిటెన్షన్ ధర కూడా దాదాపు రూ.20 కోట్లు పలకవచ్చు.
4. హార్దిక్ పాండ్యా
మెగా ట్రేడ్ డీల్ లో భాగంగా గత సీజన్ లో పాండ్యాను పక్కన పెట్టిన ముంబై ఇండియన్స్ ఈ సారి ఈ ఆటగాడిని అట్టిపెట్టుకునే అవకాశాలున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో డీల్ ను ఆఫర్ చేయవచ్చు.
5. రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 వేలానికి ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ పై చాలానే సందేహాలున్నాయి. ఈ సినియర్ ఆటగాడు ముంబై ఇండియన్స్ నుంచి నిష్క్రమించవచ్చని అంటున్నారు. గత సీజన్‌కు ముందు రోహిత్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించినప్పటికీ, ఫ్రాంచైజీ అతనిని కొనసాగించడానికి సిద్ధంగా ఉందని తాజా నివేదిక పేర్కొంది. రోహిత్ మెగా వేలంలోకి ప్రవేశించకుండా ఉండటానికి అతనికి రూ. 20 కోట్లు వరకు ముట్టజెప్పే చాన్స్ ఉంది.
Also Read : Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న బైడెన్