Minister Kondapalli : జగన్ ప్రభుత్వం సంస్థలను నాశనం చేసింది

పరిశ్రమలఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు...

Minister Kondapalli : జగన్ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ(మంగళవారం) బిజినెస్ ఎక్స్ పో జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli) మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందన్నారు.

Minister Kondapalli Comment

పరిశ్రమలఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అనేకమంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. చిన్న తరహా సహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ పరంగా చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించే విధంగా బ్యాంకు నుంచి రుణాలను కూడా అందజేస్తున్నామని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పరిశ్రమలు ప్రోత్సహించడం స్వాగతిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల విధానాలు ప్రోత్సాహకాలను కూడా తాము పరిశీలిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.

సీఎంచంద్రబాబు చెప్పినట్లు థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరూ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు విషయంలో ఒక పాలసీని అమలు చేయడంతో పాటు రోడ్ మ్యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా ఏ అవసరం ఉన్న నేరుగా తన కార్యాలయానికి వచ్చి కలవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Also Read : US Elections 2024 : అమెరికా ఎన్నికల్లో ఓటర్లు నిలబడేది కమలా వైపా.. ట్రంప్ వైపా

Leave A Reply

Your Email Id will not be published!