Minister Bandi Sanjay : మరోసారి కేటిఆర్ పై కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌నుగద్దె దింపే దమ్ము బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు...

Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్, రేవంత్ కాంప్రమైజ్ అయ్యారని.. అందుకే మొన్నటి జన్వాడా కేసును గాలికి వదిలేశారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడుతూ.. రేవంత్‌తో కేటీఆర్(KTR) ములాకత్ రాజకీయాలు నడిపిస్తున్నారని.. తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మీడియాలో లేకుండా చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆ పార్టీ గురించి ఆలోచించే వారెవరూ లేరన్నారు.

Bandi Sanjay Comment

కాంగ్రెస్‌నుగద్దె దింపే దమ్ము బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో అనే భయం కేటీఆర్‌కు ఉందన్నారు. ప్రజా సమస్యల మీద కేసీఆర్ స్పందించడం లేదని.. కేటీఆర్ బామ్మర్ది అరెస్ట్ అయితే అధికారులకు ఫోన్ చేస్తారా అంటూ మండిపడ్డారు. కేటీఆర్ బామ్మర్ది మీద కేసు అయితే ఎమ్మెల్యేలు అంతా వెళ్తారని.. కానీ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు అయితే మాత్రం వారిని పరామర్శించరన్నారు. అభ్యర్థి లేడు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంటుందంటూ వ్యాఖ్యలు చేశారు.సర్పంచ్‌లు, ఆటో వాళ్ల పొట్ట కొట్టింది బీఆర్‌ఎస్సే అని.. మళ్ళీ వీరే వారి పట్ల సానుభూతి చెప్పేందుకు వెళ్తే వారు నమ్ముతారా అని నిలదీశారు. అందుకే కేటీఆర్‌ను అడ్డుకుంటున్నారన్నారు. ఆందోళనకారులు కూడా ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ళను ఉద్యమాలకు పిలిస్తే మీరే నష్టపోతారన్నారు.

బీఆర్‌ఎస్‌లోహరీష్ రావు ఎంతో కొంత క్రిడిబులిటీ కలిగిన నాయకులని.. అయితే కేటీఆర్ అహంకారి అంటూ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ తమాషాలు మానేయాలని హితవుపలికారు. ప్రధాని గురించి కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే అహంకారం పెరిగిందని.. ఆయన కళ్ళు నెత్తికెక్కాయంటూ విరుచుకుపడ్డారు. బండి సంజయ్(Bandi Sanjay), రేవంత్ ఒక్కటేనని సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ‘‘ కేటీఆర్ గత చరిత్ర ఏంటి.. గతంలో నీవు మీ నాన్న చేసిన వ్యాపారం ఏంటి. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి. కేటీఆర్‌కు రాజ్‌భవన్ అంటే గౌరవం లేదు. కేటీఆర్ ఆయనకి ఆయనే మలేసియా పారిపోయాడు అని ప్రచారం చేసుకున్నాడు. నీవు మలేషియా పారిపోయావ్ అనేది ఎంత నిజమో… రాజ్‌భవన్ వేదికగా నీ మీద కుట్ర జరిగింది అనేది అంతే నిజం అయ్యి ఉండొచ్చు. బీజేపీలోకి హరీష్ రావు వస్తానంటే తీసుకోవడం … నా ఒక్కడి నిర్ణయం కాదు. మాది ఏక్ నిరంజన్ పార్టీ కాదు … పార్టీలో అంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

‘‘నీబిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు. నిన్ను జైలుకు పంపించారు. జైలుకు పంపించిన వారితో కాంప్రమైజా.. రేవంత్ – కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదు. ఆరు గ్యారంటీల అమలు మీద పాదయాత్ర చేయాలి. ఇల్లు కూల్చిన చోట రేవంత్ పాదయాత్ర చేయాలి. కలలో కూడా కేటీఆర్‌కు బండి సంజయ్ కనిపిస్తున్నాడు’’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

Also Read : Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి షాక్ ఇచ్చిన మహిళ కమిషన్

Leave A Reply

Your Email Id will not be published!