Kishan Reddy : సీఎం సాబ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి
ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు వేశారు కిషన్ రెడ్డి...
Kishan Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలసి మోడీ దగ్గరకు వెళ్లారు కిషన్ రెడ్డి(Kishan Reddy). ఈ భేటీ విశేషాలను ఆయన ప్రెస్ మీట్లో పంచుకున్నారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధానిని రిక్వెస్ట్ చేశామన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ మోడీ టైమ్ ఇచ్చారని.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని ఆయన అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
Kishan Reddy Slams CM Revanth Reddy
తెలంగాణలో ప్రాజెక్టుల అమలు కోసం సమర్థవంతంగా, ప్రొయాక్టివ్గా పనిచేయాలని ప్రధాని మోడీ సూచించారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాసమస్యల మీద ఎప్పుడూ దృష్టి పెట్టాలని.. ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పలు ప్రశ్నలు వేశారు కిషన్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని క్వశ్చన్ చేశారు. సీఎం సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని ఈ ముఖ్యమంత్రి కూడా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ సర్కారు ఏడాది కాలం పూర్తి చేసుకుందని.. ఇకనైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. పాలన మీద దృష్టి పెట్టాలని తెలిపారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల తెలంగాణ నష్టపోతోందని పేర్కొన్నారు. గతంలోని బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. హామీల అమలులో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. తూతూమంత్రంగా అమలు చేసినట్లు నటిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదని.. ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు కిషన్ రెడ్డి. ఈ ప్రశ్నలకు రేవంత్ సమాధానం చెప్పి తీరాలన్నారు.
Also Read : Eknath Shinde : సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఇన్ డైరెక్ట్ గా సంకేతాలిచ్చిన షిండే