Renuka Swamy Case : రేణుకా స్వామి కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్
పవిత్ర గౌడ ఇంట్లో పనిచేసే పవన్ వాట్సప్ మెసేజ్‌ల ద్వారా రేణుకా స్వామిని గుర్తించే కీలక పాత్ర పోషించాడు..
Renuka Swamy : చిత్రదుర్గ రేణుకా స్వామి హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఖైదీలకు బెయిల్ మంజూరు చేయబడింది. బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో హత్యకేసులో మొత్తం 17 మంది బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పొందిన వారిలో రాజరాజేశ్వరినగర్ స్టోని బ్రూక్ రెస్టారెంట్ యజమాని వినయ్, పవిత్రగౌడ సహాయకుడు పవన్, చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర, వినయ్ మరియు నందీశ్‌లు ఉన్నారు.
Renuka Swamy Murder Case Updates
పవిత్ర గౌడ ఇంట్లో పనిచేసే పవన్ వాట్సప్ మెసేజ్‌ల ద్వారా రేణుకా స్వామిని గుర్తించే కీలక పాత్ర పోషించాడు. అలాగే, దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర హత్య జరిగిన రోజున చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హత్య జరిగిన రోజు, దర్శన్ సహా పలువురు స్టోని బ్రూక్ రెస్టారెంట్‌లో గడిపినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వారు సుదీర్ఘకాలం జైలులో గడిపారు.
Also Read : CM MK Stalin : ద్రావిడ పాలనను విమర్శించే వాళ్ల పై భగ్గుమన్న సీఎం స్టాలిన్