Minister Ponguleti : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో కాస్మొటిక్ చార్జీలు పెంచాం
కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం కృషి చేస్తామని అన్నారు...
Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీలు పెంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కొత్తగూడెం శ్రీ రామచంద్ర కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా రూ. 657 కోట్ల ఖర్చుతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.
Minister Ponguleti Comment
కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ, ప్రైవేట్ భూముల్లో ఫీజుబిలిటి సర్వే చేస్తున్నట్లు ప్రకటించారు.కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టలల్లో చదువుకున్న పేద విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం కనీసం భోజనం పెట్టలేదని ఆరోపించారు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Also Read : Minister Atchannaidu : జగన్ సర్కార్ పై భగ్గుమన్న మంత్రి అచ్చెన్నాయుడు