Minister Nimmala : 2025 డిసెంబర్ నాటికి పోలవరం కాఫర్ డ్యాం పూర్తి చేస్తాం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు...

Minister Nimmala : ‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగం కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు అయిదేళ్ల జగన్‌ పాలనలో నిర్లక్ష్యంతో నిర్వీర్యమైపోయాయి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ రూ.900 కోట్లతో కొత్త కాఫర్‌ డ్యాం నిర్మాణం అత్యాధునిక పరిజ్ఞానంతో చేపట్టాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం.

Minister Nimmala Ramanaidu Comments..

పోలవరం మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు త్వరలోనే పునఃప్రారంభించి 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో 72 శాతం పూర్తి చేసిన పోలవరం పనులను వైసీపీ పాలనలో అర్ధంతరంగా ఆపివేసింది. టిడ్కో గృహాలపై రాష్ట్ర వ్యాప్తంగా రూ.ఐదు వేల కోట్లు రుణం తీసుకువచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆ నిధులను టిడ్కో అకౌంట్లలో జమ చేయకుండా దారి మళ్లించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు హడ్కో నుంచి రూ.5 వేల కోట్లు రుణం తీసుకుని టిడ్కో గృహాల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం’ అని మంత్రి నిమ్మల తెలిపారు. ఆర్‌డీవో దాసి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ బి.విజయ సారథి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Also Read : Arvind Kejriwal Slams : బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోతో ఢిల్లీకే కాదు దేశానికే ముప్పు

Leave A Reply

Your Email Id will not be published!