Delhi Elections-AP CM : 1995లో హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీకి తీసుకువచ్చారు

ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ చరిత్రకు ఒక మలుపు అవుతుందని ఆయన అన్నారు...

Delhi Elections : స్వచ్ఛభారత్‌ ప్రారంభంలో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికిపాటు బాట పడింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1995లో హైదరాబాద్‌ పరిస్థితి ఎలా ఉండేదో, అదే పరిస్థితి నేడు ఢిల్లీలో ఉందని ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Delhi Elections-AP CM Chandrababu Campaign

షహదారా ఎమ్మెల్యేగా బీజేపీ(BJP) అభ్యర్థి సంజయ్‌ గోయల్‌ను గెలిపించాలని చంద్రబాబు(CM Chandrababu) విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, ఆప్‌ ప్రభుత్వంతో పదేళ్లుగా పాలన సాగినా, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించలేకపోయారని ఆయన విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధి కంటే, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే బీజేపీని గెలిపించమని ఆయన పిలుపునిచ్చారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కారు అవసరాన్ని ప్రతి ఇంట్లోకి చేరి వివరించాల్సిన బాధ్యత తెలుగు ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కేజ్రీవాల్‌ ఢిల్లీని కూల్చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ చరిత్రకు ఒక మలుపు అవుతుందని ఆయన అన్నారు.

“అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలి” అని చంద్రబాబు చెప్పారు. ఆయారాం, గయారాంలకు ఓటు వేయవద్దని, సుస్థిర పాలన ఇవ్వగల, ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే వారిని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి దూరంగా ఉంది. ఒక్కప్పటి బిహార్‌ నుండి ఉపాధికి వచ్చేవారు, ఇప్పుడు ఢిల్లీ పాలకుల తీరుతో యువత బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్ళిపోతున్నారు” అని చంద్రబాబు చెప్పారు.

ఆప్‌ పాలనలో అభివృద్ధి లేకుండా రోడ్లు, మౌలిక సదుపాయాలు లేకపోయాయని, కాలుష్యం ఊహించని స్థాయికి చేరిందని ఆయన అన్నారు. “డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో ఢిల్లీ వాషింగ్టన్‌, న్యూయార్క్‌ను కూడా తలదించేది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

“బీజేపీని గెలిపిస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందుతాయి” అని ఆయన చెప్పారు.

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ప్రత్యర్థి పార్టీ గల్లంతై డిపాజిట్లు కూడా సాధించలేదని చంద్రబాబు అన్నారు. “ఏడు నెలల్లోనే రూ.7 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రంలో వచ్చినవి. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే ఇది సాధ్యమైంది” అని ఆయన చెప్పారు.

జగన్‌ రుషికొండ ప్యాలెస్‌ కట్టినట్లు, ఢిల్లీలో కేజ్రీవాల్‌ కూడా బ్రహ్మాండమైన శీష్‌ మహల్‌ కట్టారు. “అందులోకి ప్రవేశించడానికి ముందు మీరు గెలవాలని” ఆయన సూచించారు.

“తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఒక్కటిగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటాను” అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

“పెట్టుబడుల కోసం దావోస్‌ వెళ్లినప్పుడు 650 మంది ఉన్నారు. ఆ ఐటీ, గ్రీన్‌ ఎనర్జీ గురించి ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను… ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. 2047 కల్లా భారత్‌ నెంబర్‌ 1 అవుతుంది” అని ఆయన చెప్పారు.

కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ, “సంక్షేమం, అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తారని” కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, బస్తీపాటి నాగరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌, బైరెడ్డి శబరి, జీఎం హరీష్‌, బాలశౌరి, ఉదయ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Botsa Satyanarayana : ఏపీ మాజీ సీఎం జగన్ జనంలోకి రాకపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే బొత్స

Leave A Reply

Your Email Id will not be published!