CM Mamata Banerjee : కుంభమేళాలో మృతుల లెక్కలపై ‘సీఎం మమతా’ ఘరం

ఎంతమంది చనిపోయారనే కచ్చితమైన లెక్కలను ప్రభుత్వం విడుదల చేయలేదు...

Mamata Banerjee : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల సంఖ్యపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు.యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కచ్చితమైన మృతుల లెక్కలు చెప్పలేదని ఆన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారంనాడు బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు.

Mamata Banerjee Slams UP Govt

“మహాకుంభ్ తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారనే కచ్చితమైన లెక్కలను ప్రభుత్వం విడుదల చేయలేదు. మహాకుంభ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నట్టు హైప్ సృష్టించారు. కానీ వేదకల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు” అని మమతా బెనర్జీ ఆరోపించారు. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29వ తేదీ తెల్లవారు జామున ఒంటిగంట, రెండు గంటల మధ్య త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగిన 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకూ గాయపడ్డారు. మమతా బెనర్జీ కంటే ముందు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సైతం తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ బీజేపీ సర్కార్ దాచిపెట్టిందని, తప్పుడు లెక్కలు చెప్పిందని ఇటీవల ఆరోపించారు. కుంభమేళా ఏర్పాట్లలో అవకతవకలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందన్నారు. ఘనటపై సీబీఐ విచారణ జరిపించాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, మహాకుంభ్ ఏర్పాట్ల పర్యవేక్షణను ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Also Read : ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రత్యేక బహుమానం అందించిన భారత ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!