TTD Updates : ఈరోజు 10 గంటలకు శ్రీవారి మే నెల దర్శన టికెట్లు

TTD : తిరుమల శ్రీవారి ఆర్జితసేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల మే నెల కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ లక్కీడిప్‌ రిజిస్ర్టేషన్‌ కోసం 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో భక్తులు నమోదు చేసుకోవచ్చు.21వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను కూడా విడుదల చేస్తారు.

TTD May Quota Darshan Tickets

22న ఉదయం 11 గంటలకు శ్రీవాణిటికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టోకెన్లను జారీ చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని టీటీడీ అధికార వెబ్‌సైట్‌ ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

Also Read : Toronto Flight Crash : టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతూ బోల్తా పడ్డ ప్లేన్

Leave A Reply

Your Email Id will not be published!