Kinjarapu Rammohan Naidu: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురకలు !
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురకలు !
Rammohan Naidu : వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి చేస్తున్న ప్రకటనలపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)… ఎయిర్ పోర్ట్ ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూసేకరణ మాత్రమే చేస్తుందని ఆయన వివరించారు. ఎయిర్ పోర్టులు నిర్మించేది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు ఉన్నారన్నారు. అంతేకాదు విమానాశ్రయాలను నిర్మించేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదంటూ సీఎం రేవంత్ కు చురకలంటించారు.
Minister Rammohan Naidu Comment
తాము మాట ఇచ్చామని.. అందుకు అనుగుణంగా వరంగల్ ఎయిర్ పోర్ట్‌ను ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఎంత తొందంగా భూసేకరణ చేస్తారో చూస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) సవాల్ విసిరారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, నిజామాబాద్ లలో కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇక ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక పరంగా సాధ్యాసాధ్యాలపై తమ టెక్నీకల్ టీం సర్వే చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా మీరు అధికారంలోకి వచ్చే నాటికీ తెలంగాణ రాష్ట్రం సర్ ప్లస్ ( నిధులు మిగులు) రాష్ట్రంగా ఉందని.. కానీ నేడు అదే రాష్ట్రం అప్పుల పాలు ఎలా అయిందో జవాబు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ప్రజలకు చెప్పి… వాటిని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆగం చేశాయంటూ మండిపడ్డారు.
మామునూరులోఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ క్రెడిట్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనంటూ ఆ పార్టీ అగ్రనేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ క్రెడిట్ తమదే అంటూ మామునూరులో బీజేపీ క్యాడర్… కాంగ్రెస్ కేడర్ తో ఘర్షణకు దిగింది. ఆ క్రమంలో ప్రధాని మోదీ చిత్ర పటానికి పుష్పాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలతో మామునూరు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకుని బిగ్గరగా నినాదాలు చేపట్టారు. వారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. వారి ప్రయత్నాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు.
Also Read : PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ !