Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ! ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ ?
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ! ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ ?
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(CM Chandrabau) ఛాంబర్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. అదే విధంగా మే నెల నుంచి ప్రారంభించబోయే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది.
Deputy CM Pawan Kalyan Meet
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 11న నామినేషన్ల పరిశీలనకు, 13న నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. దీనితో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈవో వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుధీర్ఘంగా చర్చిచినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు… అదే విధంగా పార్టీకు విధేయులుగా ఉంటూ గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఆయా పార్టీలకు అండగా ఉండే నాయకులు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ నుండి ఎమ్మెల్సీను ఎవరికి కేటాయించాలి అనే దానిపై కూడా సమాలోచనలు చేసినట్లు సమాచారం.
Also Read : 10th Class Hall Tickets: వాట్సాప్ లో పదోతరగతి హాల్‌టికెట్లు ! డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అంటే ?