Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ చేస్తాం – శశికళ

ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ చేస్తాం - శశికళ

Shashikala : ఎన్నికల గుర్తు విషయంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేసారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేసి గెలుద్దామంటూ మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అనుచరుడు, మాజీ మంత్రి వైద్యలింగానికి శశికళ భరోసా ఇచ్చారు. ఇటీవల వైద్యలింగం తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొంది తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపం తెలుంగన్‌ కుడికాడులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Shashikala Comment

ఈ విషయం తెలుసుకున్న శశికళ(Shashikala) మంగళవారం తన సోదరుడు దివాకరన్‌ తో కలిసి వైద్యలింగం నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ… ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాదిలో అందిరికీ మంచిరోజులు వస్తాయని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయడం ఖాయమని భరోసా ఇచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో జయ పాలన రావటం తథ్యమని కూడా శశికళ ప్రకటించారు. ప్రస్తుతం వైద్యలింగంతో శశికళ భేటీ కావటం సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

తమిళనాడులో ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ అధికారంలో ఉండగా… కొత్తగా విజయ్ పార్టీ పెట్టారు. మరోవైపు బీజేపీ కూడా ఎలాగైనా ఈ సారి తమిళనాట పాగా వేయాలని భావిస్తోంది. కాంగ్రెస్, ఏఐఏడిఎంకే పార్టీలు కూడా ఎన్నికల్లో తమ హవా కొనసాగించాలని ప్రయత్నించడంతో తమిళ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి.

Also Read : MDR Fee: యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ రుసుములను విధింపుకు ప్రభుత్వం ప్రతిపాదన ?

Leave A Reply

Your Email Id will not be published!