Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించిన ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ పొడిగింపు
ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించిన ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ పొడిగింపు
Kadambari Jatwani : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్తను కాపాడేందుకు గత వైసీపీ హయాంలో ముంబై నటి కాందబరీ జత్వానిను అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కాదంబరీ జత్వానిని(Kadambari Jatwani) వేధింపులకు గురిచేసిన అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో తాజాగా వారి సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు ఏపీ(AP) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. 25 సెప్టెంబరు 2025 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగించినట్లు విజయానంద్ తెలిపారు.
Kadambari Jatwani Case Updates
వైసీపీ హయాంలో ముంబై నటి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేశారు. అనంతరం ఓ వ్యాపారవేత్తపై కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగి వేధించారు. ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లు కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు కూటమి సర్కార్ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ఈ మేరకు వైసీపీ నేత విద్యాసాగర్, పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితుడు విద్యాసాగర్‍ను అరెస్టు చేయగా… దాదాపు 76 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్‍పై విడుదల అయ్యాడు. మరోవైపు తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సదరు అధికారులు ఏపీ హైకోర్టును సైతం ఆశ్రయించారు.
Also Read : Bhupathi Raju Srinivasa Varma: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు కారు ప్రమాదం ! స్వల్ప గాయాలు !