QS Rankings: ప్రపంచ టాప్-50 జాబితాలో 9 భారతీయ విద్యా సంస్థలు
ప్రపంచ టాప్-50 జాబితాలో 9 భారతీయ విద్యా సంస్థలు
QS Rankings : వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలో అత్యుత్తమమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో తొమ్మిది భారతీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానం దక్కింది. లండన్‌కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ బుధవారం 15వ సబ్జెక్టు వారీ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత్ లోని 9 యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ‘క్యూఎస్(QS Rankings)’ ప్రపంచ టాప్-50 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. సబ్జెక్టుల వారీగా ఇచ్చిన ఈ ర్యాంకుల్లో మినరల్, మైనింగ్ ఇంజనీరింగ్‌లో ధన్‌బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎ్‌సఎం) 20వ ర్యాంకుతో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలిచింది. ఇదే సబ్జెక్టులో ముంబై, ఖరగ్‌పూర్ ఐఐటీలు వరుసగా 28, 45 స్థానాలు దక్కించుకున్నాయి. ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్‌లో ఢిల్లీ, ముంబై ఐఐటీలు టాప్-50లో చోటు సంపాదించాయి. ఐఐటీ మద్రాస్ (పెట్రోలియం ఇంజనీరింగ్), జేఎన్‌యూ (డెవల్‌పమెంట్ స్టడీస్) టాప్-50లో నిలిచాయి.
QS Rankings on World top 50
దంత వైద్య శాస్త్రంలో సవిత మెడికల్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ (తమిళనాడు) కూడా టాప్-50లో చోటు దక్కించుకుంది. బిజినెస్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఐఐఎం అహ్మదాబాద్ 27వ స్థానం, ఐఐఎం బెంగళూరు 40వ స్థానంలో నిలిచాయి. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఐఐటీ మద్రాస్, డెవలప్‌మెంట్ స్టడీస్‌లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లు ప్రపంచంలో అత్యుత్తమ 50 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉండగా, క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ సత్తా చాటింది. ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించింది. ఆంగ్ల భాష- సాహిత్యం కోర్సుకు 251-300 బ్యాండ్ ర్యాంకింగ్ లభించింది. లింగ్విస్టిక్స్ 301-350, సోషియాలజీ 301-375, కెమిస్ట్రీ 451-500, ఎకనామిక్స్-ఎకనామెట్రిక్స్ 501-550, ఫిజిక్స్-ఖగోళశాస్త్రం 601-675, బయోలాజికల్ సైన్సెస్ సలో 651-700 బ్యాండ్ ర్యాంకింగ్ దక్కింది. మొత్తంగా ప్రపంచ జాబితాలో భారత్ కు చెందిన 79 వర్సిటీలు వివిధ అంశాల్లో 533 ర్యాంకులు పొందాయి.
Also Read : Byrnihat: ప్రపంచంలోనే అత్యంత కలుష్యమైన నగరంగా బిర్నిహాట్ !