Telangana Secretariat: తెలంగాణ సచివాలయంపై డ్రోన్ చక్కర్లు ఇద్దరు అరెస్ట్
తెలంగాణ సచివాలయంపై డ్రోన్ చక్కర్లు ఇద్దరు అరెస్ట్
Telangana : హైదరాబాద్ లోని తెలంగాణా రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు గమనించిన ఎస్పీఎఫ్ పోలీసులు… ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో సచివాలయ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచివాలయ అధికారుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వంశీ, నాగరాజు అనే ఇద్దరి వ్యక్తులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సచివాలయ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Telangana – వరంగల్ లో దారుణం ! పెట్రోల్ పోసుకుని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం !
వరంగల్ లో దారుణం జరిగింది. బ్యాంకు వారి వేధింపులు తాళలేక కుటుంబం ఒక వస్త్ర వ్యాపారి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… వరంగల్(Warangal) నగరానికి చెందిన చిలుకూరి బ్రదర్స్… “చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ ” పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపార, కుటుంబ అవసరాల నిమిత్తం ఓ బ్యాంకు నుంచి అప్పుగా కొంత నగదు తీసుకున్నారు. వ్యాపారం నష్టాల్లో కూరుకుపోవడంతో బ్యాంకుకు వాయిదాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీనితో బ్యాంకు ఏజెంట్లు చిలుకూరి బ్రదర్స్ ఇల్లు, దుకాణం వద్దకు వస్తూ వారిని వేధించడం మెుదలుపెట్టారు. అందరి ముందే అవమానిస్తూ కించపరిచారు.
దీనితో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక సదరు కుటుంబసభ్యులు మెుత్తం వరంగల్ చౌరస్తాలో ఆత్మహత్యాయత్నం చేశారు. అంతా కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం 108కి సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Also Read : Gajendra Singh Shekhawat: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాన్వాయ్‌పై దాడి