YS Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి

వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి

YS Viveka : రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకా హత్య కేసు రోజుకోక సంచలనం నమోదవుతుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న ఇటీవల మృతి చెందగా… అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దానిపై ప్రత్యేకంగా సిట్ చేత దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక సాక్షులంతా ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ఇటీవల వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి… గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఇది జరిగి 24 గంటలు జరగకముందే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షాబానాపై వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

YS Viveka Murder Case Updates

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా(YS Viveka) హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. మల్యాలలో ఆమెపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఇద్దరు మహిళలు ఉద్దేశ పూర్వకంగా ఇంట్లోకి చొరబడి పథకం ప్రకారం దాడి చేశారాని షబానా తెలిపారు. అంతేకాదు ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. షబానాపై దాడి విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న దస్తగిరిపై కూడా వైసీపీ మహిళా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసులకు తెలిపారు.

‘‘జగన్‌, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడుతారా ? అంటూ విచక్షణారహితంగా కొట్టారు. మల్యాల గ్రామానికి చెందిన శంషున్‌, పర్వీన్‌ను ఎవరు పంపితే నాపై దాడి చేశారో పోలీసులు తేల్చాలి. రంగన్న చనిపోయిన తర్వాత నా భర్తను చంపాలని చూస్తున్నారు. ఇద్దరు మహిళలూ పదే పదే అవినాష్‌రెడ్డి పేరు ప్రస్తావించారు. నిన్న సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు’’ అని షబానా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : TTD: తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్‌

Leave A Reply

Your Email Id will not be published!