Minister Nityanand Rai: గ్లాసు నీటి కోసం జరిగిన గొడవలో కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య

గ్లాసు నీటి కోసం జరిగిన గొడవలో కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య

Minister Nityanand Rai : కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బిహార్‌ లోని భాగల్‌పుర్‌ కు చెందిన జగత్‌పుర్ గ్రామంలో వారి నివాసంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తాగునీటి విషయమై ఇరువురి మధ్య వివాదం చెలరేగి, అదికాస్తా ఒకరి హత్యకు దారితీసిందని తెలిపాయి.

Minister Nityanand Rai..

‘‘జగత్‌పుర్ గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని మాకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వారిలో ఒకరు మృతి చెందగా… మరొకరికి గాయాలయ్యాయి. వారి గొడవను ఆపేందుకు మధ్యలో వారి తల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు కూడా బుల్లెట్ గాయం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది’’ అని పోలీసు వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌(Minister Nityanand Rai) కు బావ అయిన రఘనందన్ యాదవ్‌ కు ఇద్దరు కుమారులు. వారు జైజిత్‌ యాదవ్, విశ్వజిత్ యాదవ్‌. వారింట్లో పనిచేసే సహాయకుడు సర్వ్‌ చేస్తోన్న సమయంలో తన చేతిని గ్లాసులో ముంచడమే వీరి గొడవకు కారణమని తెలుస్తోంది. ఆ గొడవ పెరిగి ఇద్దరుకాల్పులు చేసుకోగా… విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పటినుంచో ఈ అన్నదమ్ముల మధ్య సంబంధాలు సరిగా లేవని సమాచారం.

Also Read : Badar Khan Suri: అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు ! హమాస్‌తో సంబంధాలే కారణమా ?

Leave A Reply

Your Email Id will not be published!