Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు మృతి

ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు మృతి

Air India : ఢిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లఖ్‌నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సీట్లు శుభ్రం చేస్తున్న సిబ్బంది ఓ వ్యక్తి వద్దకువెళ్లగా… అతడు ఎటువంటి చలనం లేకుండా పడి ఉండడం గమనించారు. అందులో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Incident at Air India Flight

సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్‌ ఉల్హా అన్సారీగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. విమానం ఎక్కిన అనంతరం అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండడం, సీటు బెల్ట్‌ కూడా తీయకపోవడంతో గాల్లో ఉన్న సమయంలోనే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడు మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని… మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని తెలిపారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు.

Also Read : Minister Annpurna Devi: అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి

Leave A Reply

Your Email Id will not be published!