Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం

మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం

Nara Lokesh : రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. వి

Minister Nara Lokesh Gives Key Updates New Industry

ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ ను అందిస్తోంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం.

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో పోర్టల్‌ ద్వారా స్వీయ-అభ్యసన, బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్సోపోజర్ ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు ఆయా సంస్థల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేస్తారు. మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్, కాంపిటీషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, వర్క్స్ షాప్స్ నిర్వహణ వంటివి ఏపీఎస్ఎస్ డీసీ చేపడుతుంది. ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీచేస్తుంది. ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లను అందిస్తారు. అధునాతన టెక్నాలజీలో యువత, విద్యార్థులకు మద్ధతునిచ్చే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫీచ‌ర్‌ (ఎఫ్‌వైఐఎఫ్‌) వంటి ప్రోగ్రామ్ లను సిస్కో సీఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తుంది.

పార్టీలో వివాదం రేపుతోన్న సిస్కో ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సమక్షంలో… సిస్కో ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ ఎంవోయులపై సంతకాలు చేసారు. అయితే సిస్కో ప్రతినిధుల బృందంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇప్పాల రవీంద్రరెడ్డి కూడా ఉండటం… ఆయన కూడా నారా లోకేష్ కూడా కరచాలనం చేయడంపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లతో పాటు కుటుంబ సభ్యులపై అసభ్యమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ ఇప్పాల రవీంద్రరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అటువంటి వ్యక్తి ప్రాతినిథ్యం వహిస్తున్న కంపెనీతో ఎంవోయు చేసుకోవడం… అతనితో కలిసి ఈ భేటీలో పాల్గొనడంపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు.

Also Read : CM Chandrababu Naidu: ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ

Leave A Reply

Your Email Id will not be published!