CM Chandrababu Naidu: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం - సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును(Polavaram Project) పూర్తిచేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే… అంటే 2027 నవంబర్‌ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని కూడా ఆయన తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఇప్పటికి రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు(CM Chandrababu Naidu) అన్నారు. పోలవరం ప్రాజక్టులో భూములు కోల్పోయిన బాధితులకు పునరావాసాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పనులను పర్యవేక్షించిన అనంతరం… నిర్వాసితులో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

CM Chandrababu Naidu Visit Polavaram

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న వైఎస్ జగన్‌ … అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్‌ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చంద్రబాబు చెప్పారు. ‘‘వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్‌ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. నిన్నమొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు.

సీఎం చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

ఇటీవల వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకట రమణ… పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాళ్లకు నమస్కారం చేసారు. ఈ సందర్భంగా… జయమంగళను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నారు. జయమంగళ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీకి,ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాననటంతో తెలుగుదేశం వదిలి వైసీపీలోకి వెళ్లారు జయమంగళ వెంకటరమణ. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం పార్టీకి, ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేశారు. అయితే, మండలి చైర్మన్ దగ్గర ఇంకా అతని రాజీనామా పెండింగ్ లో ఉంది.

Also Read : MLA Kolikapudi Srinivasarao: రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకు రాజీనామా చేస్తా – ఎమ్మెల్యే కొలికపూడి

Leave A Reply

Your Email Id will not be published!