TVK Chief Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు

TVK Chief Vijay : 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్(TVK Chief Vijay) తెలిపారు. బీజేపీ, డీఎంకేలు రెండు పార్టీలు ఫాసిస్టు పార్టీలని… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డీఎంకే, టీవీకే పార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందని ఆయన స్పష్టం చేసారు. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మొదటి జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, డీఎంకే పార్టీలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పలు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

TVK Chief Vijay viral Comments on 2026 Elections

ఈ సందర్భంగా తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్‌ విజయ్‌ మాట్లాడుతూ… సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK Stalin) ను గౌరవనీయులైన రాచరిక ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. డీఎంకే కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అంటూ పూర్తి పేరును ఘనంగా చెప్పుకుంటే సరిపోదు… అది చేతల్లో, పాలనలో కనిపించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ అంటూ తిట్టిపోసే డీఎంకే కూడా అంతకంటే తక్కువేం కాదు, అదే ఫాసిస్ట్‌ వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు.

ప్రజలు, కార్యకర్తలను కలుసుకోకుండా నన్ను ఆపడానికి మీరెవరు ? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై విధించిన ఆంక్షలను అనుసరించానన్నారు. సహజ వనరులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కలుగజేసే ప్రాజెక్టులను మాత్రమే తన పార్టీ వ్యతిరేకిస్తుందంటూ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఉంటామన్నారు.

రాబోయే టీవీకే ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా ఉంటారని, మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో విజయ్‌ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి జీఎస్‌టీ రూపంలో పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రానికి తగు విధంగా నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. త్రిభాషా విధానాన్ని రాష్ట్రంపై రుద్ద వద్దని, పార్లమెంట్‌లో ప్రాతినిథ్యాన్ని తగ్గించే డీలిమిటేషన్‌ అమలును ఆపాలని కోరారు. జమిలి ఎన్నికల విధానం వద్దన్నారు.

ముస్లింల హక్కులను లాగేసుకునేలా ఉన్న వక్ఫ్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విజయ్‌ కోరారు. ఎన్నికల సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని విజయ్‌ కు కట్టబెడుతూ ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. అదే సమయంలో, 543 లోక్‌సభ నియోజకవర్గాలను ఎప్పటికీ కొనసాగించాలన్నదే టీవీకే విధానమని పేర్కొంది. ఈ సందర్భంగా విజయ్‌ ను దళపతికి బదులుగా ‘వెట్రి తలైవార్‌’ అని సంబోధించాలంటూ సీనియర్‌ నేత ఆధవ్‌ అర్జున ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.

Also Read : Kolikapudi Srinivas: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ పై టీడీపీ హై కమాండ్ సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!