Chhattisgarh: మరోసారి నెత్తురోడిన రెడ్ కారిడార్ ! 17 మంది మావోయిస్టుల మృతి !

మరోసారి నెత్తురోడిన రెడ్ కారిడార్ ! 17 మంది మావోయిస్టుల మృతి !

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లోని రెడ్ కారిడార్ మరోసారి నెత్తరోడింది. తొమ్మిది రోజుల క్రితం ఈ నెల 20న బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌ నుండి మావోయిస్టులు కోలుకోకముందే… శనివారం మరో 18 మంది మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. బస్తర్‌ రీజియన్‌ లో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. కాగా, ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు డీఆర్‌జీ, మరొకరు సీఆర్‌ఫీఎఫ్‌ జవాను ఉన్నారు. గాయపడ్డ జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని బస్తర్‌ రేంజ్‌ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ ఐజీ సందర్‌రాజ్‌ తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‌లో రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Chhattisgarh – నిఘా వర్గాల సమాచారంతో

ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా-దంతెవాడ సరిహద్దు కేరళపాల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గోగుండ ప్రాంతంలోని ఊపంపల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారంతో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌), సీఆర్పీఎఫ్‌-159 బెటాలియన్‌ సంయుక్త బలగాలు ఆపరేషన్‌ నిర్వహించాయి. శనివారం ఉదయం 8 గంటల సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆ ప్రాంతంలో 17 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్‌చవాన్‌ వివరించారు. శనివారం సాయంత్రం వరకు మృతుల్లో ఏడుగురిని గుర్తించినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.

బీజాపుర్‌ జిల్లాలో నర్సపుర్‌-టేక్మెట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతదేహాన్ని, ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నారు. సుక్మా ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 17 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ ఎన్ కౌంటర్(Encounter) లో మావోయిస్టు పార్టీ ఎస్‌జడ్‌సీ (సౌత్‌ జోనల్‌ కమిటీ) సభ్యుడు, దర్బా డివిజన్‌ ఇన్‌ఛార్జి జగదీశ్‌ అలియాస్‌ బుద్రా హతమయ్యాడు. సుక్మా జిల్లా పిట్టేడబ్బా పోలీసుస్టేషన్‌ పరిధిలోని పౌర్గుడెంకు చెందిన జగదీశ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌ లో మృతి చెందిన దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి జగదీశ్‌ స్వస్థలం సుకుమా జిల్లా కుకనార్‌ గ్రామం. 2013లో 30 మంది కాంగ్రెస్‌ నాయకులను హత్య చేసిన ఘటన, 2023లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసి 10 మందిని హత్య చేసిన ఘటనల్లో జగదీశ్‌ నిందితుడు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఒకే నెలలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. మార్చి 20న బీజాపూర్‌ జిల్లా గంగలూరు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా… తాజా ఎన్‌కౌంటర్‌లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మరోవైపు,యఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 15 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

Also Read : Governor Haribhavu Bhgde: రాజస్థాన్ గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!