Indian Airforce: గుజరాత్ లో కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ జెట్
గుజరాత్ లో కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ జెట్
Indian Airforce : భారత వాయుసేనను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, హరియాణాలో ఒకే రోజు రెండు ఎయిర్ ఫోర్స్(Indian Airforce) యుద్ద విమానాలు కుప్పకూలి… నెల రోజులు తిరగకముందే మరో యుద్ధ విమానం కుప్పకూలింది. గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆ యుద్ధ విమానం రెండు ముక్కలుగా విడిపోగా… అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లలో ఒకరు గాయాలతో బయపడ్డారు. మరో పైలట్ గల్లంతయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Indian Airforce Fighter Jet Accident
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Airforce) కు చెందిన అత్యాధునిక జాగ్వర్ ఫైటర్ జెట్.. బుధవారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో జామ్ నగర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఓ పైలెట్ అప్రమత్తం అయి తప్పించుకోగా… మరొకరు గల్లంతయ్యారు. ఫైటర్ జెట్ కింద కుప్పకూలి రెండు ముక్కలయ్యింది. వెంటనే దాని నుంచి మంటలు చెలరేగాయి. ఫైటర్ జెట్ కాక్‌పిట్, టెయిల్ భాగం రెండు వేర్వేరు ప్రాంతాల్లోపడి పోయి ఉన్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వాయు సేన సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన జాగ్వార్ ఫైట్ జెట్… రెండు సీట్ల సాధారణ ట్రైనింగ్ జెట్ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఐఏఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్‌నగర్ ఐఏఎఫ్ స్టేషను సమీప గ్రామ మైదానంలో బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన జాగ్వర్ ఫైటర్ జెట్ అంబాలా ఎయిర్ బేస్ నుంచి ప్రారంభం అయ్యిందని అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య గురించి అర్థం అయిన వెంటనే.. పైలెట్ అప్రమత్తం అయ్యి.. జెట్‌ని జనావాసాలకు దూరంగా తీసుకు వెళ్లారని.. అందుకే ఈ ప్రమాదంలో స్థానికులు ఎవరు గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక పైలెట్ గల్లంతయ్యారని తెలిపేందుకు చింతిస్తున్నాము. వారి కుటుంబానికి అండగా ఉంటారు. ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయడం కోసం ఎంక్వైరీకి ఆదేశించాము” అని తెలిపారు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్ ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, రెండో పైలట్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : Amit Shah: పార్టీ అధ్యక్షుల ఎంపికపై అఖిలేశ్ కు అమిత్‌షా స్ట్రాంగ్ రిప్లయ్