Kunal Kamra: బాంబే హైకోర్టులో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు స్వల్ప ఊరట
బాంబే హైకోర్టులో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు స్వల్ప ఊరట
Kunal Kamra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బాంబే హైకోర్టు ఏప్రిల్ 16 వరకు ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై కేసు కొట్టేయాలంటూ కునాల్ వేసిన పిటిషన్ పై మహారాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని కోరింది.
Kunal Kamra Case Updates
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వ్యాఖ్యల నేపథ్యంలో కునాల్(Kunal Kamra) పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనకు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి మద్రాసు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసాడు. అతని పిటీషన్ పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు ఈ నెల 6 వరకు రక్షణ కల్పించింది. అయితే ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో కునాల్ పై నమోదైన కేసులో మూడు సార్లు విచారణకు గైర్హాజరుకావడంతో… మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేసారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు కొట్టేయాల్సిందిగా… కునాల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 16 వరకు కుణాల్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.
ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్ హోటల్‌లో గల హాబిటాట్ కామెడీ స్టూడియోలో కునాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను ద్రోహిగా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్ స్టూడియోపై 40 మంది శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Also Read : Pawan Kalyan: ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్