Vehicle Ban: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ! వచ్చే ఏడాది నుండి ఆ వాహనాలపై నిషేధం !

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ! వచ్చే ఏడాది నుండి ఆ వాహనాలపై నిషేధం !

Vehicle Ban : రాష్ట్ర ప్రభుత్వం వాహనాదారులకు షాకిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెడీ అయ్యింది. దేశ రాజధాని డిల్లీ మహానగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు వాహనాలపై నిషేధం విధిస్తూ(Vehicle Ban) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పెట్రోల్, డిజీల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, సీఎన్‌జీతో నడిచే ఆటోలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అనగా వచ్చే ఏడాది ఆగస్టు 15, 2026 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Vehicle Ban – కారణాలు ఏమిటంటే

వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నగరాల్లో ఢిల్లీ(Delhi) ప్రథమ స్థానంలో ఉంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. వాయు కాలుష్య సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దానిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం… ఆగస్ట్ 15 , 2026 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్‌జీ ఆటోరిక్షాలను రిజిస్టర్ చేయవద్దని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎంటీఎస్), ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) ఆదేశాలు జారీ చేసింది. అలానే ఇప్పటికే ఉన్న సీఎన్‌జీ ఆటోరిక్షాల పర్మిట్లను రెన్యూవల్ చేయవద్దని ఆదేశించింది. అంతేకాక పదేళ్లు దాటిన సీఎన్‌జీ ఆటోరిక్షాలను బ్యాటరీతో నడిచే వాహనాలుగా మార్చాలని సూచించింది. ఆగస్టు 15 తర్వాత కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు మాత్రమే అనుమతి ఉందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలానే పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీతో నడిచే టూవీలర్స్‌పై కూడా నిషేధం విధిస్తూ డీఐఎంటీఎస్, డీటీఎస్ నిర్ణయం తీసుకుంది. 2026, ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అంతేకాక 2026, ఆగస్టు 15 తర్వాత సరుకు రవాణా కోసం వినియోగించే పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీతో నడిచే టూవీలర్స్‌కు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్‌లు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేద్దామని భావించే వారు ప్రభుత్వ నిర్ణయాల గురించి తెలుసుకుని… నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.

Also Read : Kinjarapu Ram Mohan Naidu: జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!