Suryapet District Court: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష విధించిన సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు

కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష విధించిన సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు

Suryapet District Court : తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా కోర్టు(Suryapet District Court) సంచలన తీర్పు వెలువరించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్ని చంపిన కేసులో తల్లికి ఉరిశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌ లో మోతె మండలం మేకపాటి తండాలో జరిగిన ఘటనలో శుక్రవారం జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Suryapet District Court Sensational Verdict

మరోవైపు నాంపల్లి పోక్సో కోర్టు కూడా శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ ఫోన్‌ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్‌ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక ప్రాణాలతో బయట పడిన తర్వాత… తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌ పై పోక్సో కేసు నమోదు చేసి… దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో ఆధారాలు, సాక్ష్యాలు, బాలిక వాంగ్మూలాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొంది. అలాగే వైద్య నివేదిక సైతం నిందితుడిపై అభియోగాలను నిజమేనని స్పష్టం చేశాయి. పోక్సో చట్టం కింద కేసు విచారించిన ప్రత్యేక కోర్టు… నిందితుడు శ్రీనివాస్ దోషిగా తేల్చింది. దీనితో అతడికి 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

Also Read : Lulu Manjeera Mall: లులూ చేతికి కూకట్‌పల్లి మంజీరా మాల్‌

Leave A Reply

Your Email Id will not be published!