Former Minister Jogi Ramesh: సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేష్

సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేష్

Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఏపీ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్(Jogi Ramesh) తో పాటు మరో ఐదుగురు నిందితులు విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ భారీ కాన్వాయ్‌ తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి(CID) అప్పగించింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Former Minister Jogi Ramesh Attended

వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ తన అనుచరులతో వచ్చి అలజడి సృష్టించారు. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీఐడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా జోగి రమేష్‌ను పిలిచారు. దీనితో ఆయన ఇవాళ విచారణకు హాజరయయారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం 20 మందికి పైగా కేసులు నమోదు చేసింది. వీరిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి చేసే నాటికి జోగి రమేష్ కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కేసులో వారిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది.

Also Read : Suryapet District Court: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష విధించిన సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!