Intelligence Alert: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు నిఘా సంస్థల హెచ్చరిక

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు నిఘా సంస్థల హెచ్చరిక

Intelligence Alert : ముంబై ఉగ్రదాడి కీలక సూత్రదారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు భారత్ కు తరలించిన అధికారులకు… నిఘా సంస్థలు కీలక హెచ్చరికలు జారీ చేసాయి. దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు(Intelligence Alert) హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చంటూ రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం.

Intelligence Alert…

2008 నవంబర్ 26న 10మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబయికి చేరుకొని… సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్(Sandeep Unnikrishnan), ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు.

ఈ నేపథ్యంలో ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ పాలం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్‌ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు. రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పాటియాలా హౌస్‌ కోర్టు అనుమతించింది. దీనితో 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి.

Also Read : Ayodhya: అయోధ్య గెస్ట్‌హౌస్‌లో మహిళ అశ్లీల వీడియోలు చిత్రీకరించిన నిందితుడి అరెస్టు

Leave A Reply

Your Email Id will not be published!