Pawan Kalyan: గిరిపుత్రులకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ! ఆనందంలో అల్లూరి జిల్లా గిరిజనులు !
గిరిపుత్రులకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ! ఆనందంలో అల్లూరి జిల్లా గిరిజనులు !
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరుకానుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… గిరిజనులతో మమేకమయ్యారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు వెళ్ళిన పవన్ కళ్యాణ్… అక్కడి గిరిజనుల సమస్యలు సావధానంగా విని… పరిష్కారానికి పలు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో కూడా గిరిజనులు చెప్పులు లేకుండా తిరుగుతుండటం చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan)… వారందరికీ చెప్పులను పంపిణీ చేయాలని తన కార్యాలయ అధికారులకు సూచించారు.
Pawan Kalyan Surprise
దీనితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆదేశాల మేరకు అధికారులు… ఆ గ్రామంలోని సర్వే నిర్వహించి… వారికి అవరసమైన పాదరక్షల సైజు వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ గ్రామస్థులకు సరిపడా చెప్పులను కొని… పెద్దపాడుకు తరలించారు. స్థానిక నాయకులు, సర్పంచ్, పవన్ కార్యాలయం సిబ్బంది వాటిని ఇంటింటికి పంపిణీ చేసారు. మొత్తం 345 మందికి ఈ సందర్భంగా పాదరక్షలు పంపిణీ చేసారు. తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పులు పంపడంతో వాటిని ధరించి గిరిజనుల హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టం తెలుసుకొని చొరవ తీసుకున్న పవన్ కు గిరిపుత్రులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉంటుండగా… తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలయ్యారు. అదే రోజు అతని పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా. అయినప్పటికీ ముందురోజు స్థానిక గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం… కురిడి గ్రామంలో పర్యటించి, గ్రామ సభ నిర్వహించి, అక్కడే శివాలయంలో అభిషేకంలో పాల్గొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ నుండి తన సోదరుడు చిరంజీవి, వదిన సురేఖతో కలిసి సింగపూర్ వెళ్ళారు. పెద్ద కొడుకు పుట్టినరోజు, చిన్నకొడుకు ఆపదను లెక్కచేయకుండా… గిరిజనులతో మమేకమౌతూ పవన్ కళ్యాణ్ చూపించిన చొరవకు గిరిజనులు ఫిదా అయ్యారు. తాజాగా వారికి ప్రత్యేకంగా చెప్పులు పంపించడంతో… అడవి బిడ్డలు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : MMTS Train: ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్