NIMS: నిమ్స్‌ అగ్నిప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు

నిమ్స్‌ అగ్నిప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు

NIMS : హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట నిమ్స్(NIMS) ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిగరెట్, చెత్త వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటలోనే అగ్నిప్రమాదాన్ని కంట్రోల్‌లోకి తీసుకువచ్చారు. పొగ కంట్రోల్‌కి వచ్చాక అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

NIMS Fire Accident Shocking Updates

లిఫ్ట్ పక్కన ఉన్న చెత్త, కాల్చి పడేసిన బీడీ, సిగరెట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేర్ లెస్ స్మోక్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మొదట సిగరెట్‌ తో చెత్త అంటుకొని, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు అంటుకుందని పోలీస్ అధికారులు నిర్దారించారు. సిబ్బంది ఖాళీగా ఉన్న ఐదో ఫ్లోర్‌ లో చెత్త పడేశారని అన్నారు. అక్కడే కొందరు సిగరెట్ తాగి పడేయడంతో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.

మరోవైపు నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బంది అక్రమంగా బాణాసంచా నిల్వలు ఉంచారంటూ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌ ఫిర్యాదు చేశారు. దీనితో సిబ్బందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read : JEE Main Result: జేఈఈ మెయిన్ ఫ‌లితాల్లో 110 మందికి షాక్

Leave A Reply

Your Email Id will not be published!