10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్

10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్

10th Class Results : పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు వెల్లడించారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మన మిత్ర), లీప్ యాప్‌ లలో ఫలితాలు చూసుకోవచ్చని వివరించారు. ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతితోపాటు(10th Class Results) ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’(వాట్సాప్), LEAP మొబైల్ యాప్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Andhra Pradesh 10th Class Results Updates

ఇక అభ్యర్థులు ఫలితాలను వాట్సాప్‌ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని… వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కలిగించినట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 6,49,884 మంది విద్యార్థులు ఫీజుకట్టారు. కానీ వారిలో 6,19,275 మంది పరీక్షలు రాశారు. ఈ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం మొత్తం 26 జిల్లాల్లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమై… ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. ఇక మార్కులను ఆన్‌ లైన్‌ లో ఎంటర్‌ చేసే ప్రక్రియ కూడా ముగిసింది. దీనితో ఫలితాల విడుదలకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది.

Also Read : Rahul Gandhi: సీఎం రేవంత్‌ కు రాహుల్ గాంధీ లేఖ ! ఎందుకంటే ?

Leave A Reply

Your Email Id will not be published!