Pakistan Nationals: పారాదీప్‌కు వచ్చిన నౌకలో 21 మంది పాకిస్తానీలు
పారాదీప్‌కు వచ్చిన నౌకలో 21 మంది పాకిస్తానీలు
Pakistan Nationals : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒడిశాలోని పారాదీప్ ఓడరేవుకు పాకిస్థాన్ సిబ్బంది ఉన్న నౌక రావడం కలకలం సృష్టించింది. దీనితో అప్రమత్తమైన అధికారులు నౌక నుంచి ఎవరూ భూభాగం పైకి రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం… దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా 2 లక్షల టన్నుల క్రూడాయిల్ తో వచ్చిన ఎం.టి.సైరన్-2 నౌక బుధవారం పారాదీప్ తీరానికి చేరింది. తీరానికి 20 కి.మీ. దూరంలో లంగరు వేసిన ఈ నౌకలో తనిఖీ చేయగా 25 మంది సిబ్బందిలో 21 మంది పాకిస్థానీయులని అధికారులు గుర్తించారు. దీనితో ముందుజాగ్రత్త చర్యగా నేవీ, కోస్ట్‌గార్డ్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది నౌక చుట్టూ మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నౌకలో ఉన్నవారెవరూ దిగకూడదని, అన్ లోడింగ్ అయిన వెంటనే నౌక వెళ్లిపోవాలని సూచించారు. సాయంత్రానికి అన్ లోడింగ్ ప్రక్రియ మొదలైందని అర్ధరాత్రి తర్వాత నౌక బయలుదేరే అవకాశముందని పోర్టు అధికారులు తెలిపారు.
Pakistan Nationals..
మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్ కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్(Pakistan) సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు.
Also Read : Minister S Jaishankar: కేంద్ర మంత్రి జైశంకర్ కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు