Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
Peddireddy Ramachandra Reddy : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy), ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు జీవవైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదిక (పీవోఆర్)లో అధికారులు పేర్కొన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy), రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నారు.
ఈ ఏడాది జనవరి 29న ఓ ప్రముఖ దినపత్రికలో ‘అడవిలో అక్రమ సామ్రాజ్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కమిటీని ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని విచారణ బృందం తేల్చింది. ఏ అనుమతులూ లేకుండానే బోరు వేశారని, ఆక్రమణల మూలంగా జీవవైవిధ్యానికి రూ.కోటికిపైగా నష్టం కలిగిందని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం వరకు హద్దు రాళ్లు నాటుతున్నారు. మరో వారంలో ఇది పూర్తవుతుంది. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినందున దీనిపై సమాలోచనలు జరుపుతున్నారు. సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారిపైనా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Peddireddy Ramachandra Reddy – బస్సు కండక్టర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా దాడి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వార్తల్లోకెక్కారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన కండక్టర్‌పై దాడి చేసినందుకు ఆయన వార్తల్లో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతిలో దెబ్బలు తిన్న కండక్టర్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
తన బస్సు కంటే ముందే వెళ్తారా అంటూ… మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ హరినాథ్‌పై దాడి చేశాడు. గురువారం మదనపల్లి పట్టణంలో బెంగళూరు బస్టాండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడితో తీవ్రంగా గాయపడిన హరినాథ్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనితో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తీరుపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Narasaraopeta Court: నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు ! తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష !
