Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్‌ కు పాల్పడ్డారని… మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలను ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Vallabhaneni Vamsi in Another Case

తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ(YCP) నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోశుక్రవారం సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో వంశీకి రిలీఫ్ వచ్చినా జైలుకే పరిమితం కానున్నారు. నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా వంశీ జైల్లో ఉండనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ రోజు వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

కాగా.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీపై ఆరోపణలు వచ్చాయి. దీనితో నూజివీడు కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం జడ్జి శ్రావణి వంశీకి రిమాండ్‌ విధించారు. ఈ కేసులో ఈ నెల 29వ తేదీ వరకు వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇదే కేసులో వంశీతో పాటు ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా కోర్టు రిమాండ్ చేసింది. ఇదిలా ఉండగానే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీపై పీటీ వారెంట్‌కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీకి 29వ తేదీ వరకు, మోహన రంగారావుకు 14 రోజుల పాటు నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది.

Also Read : Supreme Court: కంచ భూముల్లో పచ్చదనం పునరుద్ధరిస్తారా ?  జైలుకెళ్తారా ?

Leave A Reply

Your Email Id will not be published!