Bride Groom: పెళ్లి మండపంలో విషాదం ! పీటలపై వరుడు మృతి !

పెళ్లి మండపంలో విషాదం ! పీటలపై వరుడు మృతి !

 

చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేకపోతున్నాం. కోవిడ్ తరువాత ఎంతో ఫిట్ గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు పాటించేవారు సైతం ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. దీనికి కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డిల మరణాలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇందరూ చాలా ఫిట్ గా, ఎక్సైరసైజ్ బాడీలు అయినప్పటికీ… ఉన్నపలంగా కుప్పకూలి ఆసుపత్రి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల… పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని బాసూరు అనే గ్రామంలో కూడా ఓ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి మృతి చెందారు. తాజాగా కర్ణాటకలో ఓ పెళ్ళి మండపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వధువు మెడలో తాళికట్టిన కొద్ది నిమిషాలకే పీటలపైనే వరుడు మృతి చెందాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

 

కర్ణాటకలో పెళ్లి తంతు ముగిసిన 20 నిమిషాల్లోనే వరుడు ప్రవీణ్‌ గుండెపోటుతో మృతిచెందాడు. పెళ్లి పీటలపైనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో మునిగిపోయారు. వధువు మెడలో తాళి కట్టిన 20 నిమిషాలకే, పెళ్లి పీటలపైనే వరుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోటె జిల్లా జమఖండి పట్టణంలో శనివారం జరిగింది. జమఖండి తాలూకా కుంబారహళ్లికి చెందిన ప్రవీణ్‌ కుర్నే(24) వ్యవసాయం చేసేవాడు. ఈ యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. రిసెప్షన్‌ వేడుకలు జమఖండి పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. బంధుమిత్రులంతా సంతోషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన మండపంలో శనివారం మధ్యాహ్నం 12.15గంటలకు వధువు మెడలో వరుడు తాళికట్టాడు. బంధుమిత్రులు వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి పీటలపైనే మరిన్ని ప్రక్రియలు పురోహితులు కొనసాగిస్తుండగా, వరుడు ప్రవీణ్‌ తన తండ్రి శ్రీశైలను దగ్గరకు పిలిచాడు. తనకు తల తిరుగుతోందని చెప్పాడు. దీనితో తండ్రి నీళ్లు తెప్పించి తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీనితో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు, అప్పటికే ప్రవీణ్‌ గుండెపోటుతో మృతి చెందిన ట్టు నిర్ధారించారు. బంధుమిత్రులంతా దుఃఖంలో మునిగిపోయారు.

Leave A Reply

Your Email Id will not be published!