Adluri Laxman: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
Adluri Laxman : సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.
Adluri Laxman As a Minister
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖ, గడ్డం వివేక్‌కు కార్మిక, గనుల శాఖలు కేటాయించారు. తాజా విస్తరణతో క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాతమంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా… ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు.
Also Read : CM Chandrababu: ప్రధాని మోదీతోనే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు – సీఎం చంద్రబాబు
