Yogandhra: యోగా గ్రాండ్ సక్సెస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
యోగా గ్రాండ్ సక్సెస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
Yogandhra : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. యోగాడే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శనివారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేపట్టారు. సమావేశ మందిరంలోకి వచ్చిన సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) కరతాళధ్వనులతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్నివిభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు ముఖ్యమంత్రి.
మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత తీసుకుని పనిచేసిన తీరుకు అభినందనలు తెలిపారు. అర్థరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలిరావడం ఆశ్య్చర్యాన్ని కలిగించిందని కొందరు అధికారులు తెలిపారు. విశాఖ యోగా డేలో 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. పాల్గొన్నవారి లెక్కింపులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు.
Yogandhra – యోగాను ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనీకుడు మోదీ పవన్
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర (Yogandhra) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం. యోగా విశిష్ఠతను రుగ్వేదం చెబితే… దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారు. భారతీయ సనాతన ధర్మం విశిష్ఠతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోదీదే. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తంతో ఉంటారనేదానికి.. ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనేదానికి మోదీ నిలువెత్తు ఉదాహరణ. ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ థీమ్‌ను విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి’’ అని పవన్ తెలిపారు.
Also Read : Adluri Laxman: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
