Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం
Visakha Express : భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. దీనితో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీనితో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Visakha Express Theft
పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (Visakha Express) ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చోరికి పాల్పడటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించారు. పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా విశాఖ ఎక్స్‌ప్రెస్ లో ఈ దుండగులు చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించారు. అయితే రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి, దుండగులను అడ్డుకోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. లేకపోతే భారీ చోరీ జరిగేదని ప్రయాణీకులు వాపోయారు. అయితే రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దుండగులు చీకటిలో రైల్లో నుంచి దూకి తప్పించుకున్నారు. దుండగులు రైలులోని ఐదు కోచ్‌లను టార్గెట్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా వారం రోజుల వ్యవధిలో రైళ్లలో రెండు సార్లు దొంగతనాలు జరిగాయి.
Also Read : JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
