Minister Kondapalli Srinivas: చంద్రబాబు పాలన చూసే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

చంద్రబాబు పాలన చూసే రాష్ట్రానికి పెట్టుబడులు - మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Kondapalli Srinivas : రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ (Kondapalli Srinivas) చెప్పారు. ఆదివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. విజయనగరం జిల్లాలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఏడాది కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలును ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.

Minister Kondapalli Srinivas Praises CM Chandrababu

పెన్షన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్దఎత్తున చేస్తున్నామని, ఎన్నికల హామీలను నెరవేర్చేలా ముందుకు వెళ్తున్నామనీ ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టి అనేక కంపెనీలను తీసుకొస్తున్నామని, మంచి ఐటీ పాలసీని తీసుకువచ్చామనీ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు రూ.27 వేల కోట్ల రుణం డ్వాక్రా మహిళలకు ఇచ్చామనీ, అద్భుతమైన రుణప్రణాళికతో సెర్ప్ ముందుకు సాగుతుందని, ఎక్కువమంది ఎస్ హెచ్ జి మహిళలకు లబ్ధి చేకూర్చామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులను గత ప్రభుత్వం విస్మరించిందని ఫలితంగా ప్రజల జీవితాలలో అంధకారం నెలకొందని చెప్పారు.

జిందాల్ భూముల్లో యం ఎస్ యం ఈ పార్కు అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందన్నారు. అయితే, ఆ పార్కులో ఏ పరిశ్రమలు వస్తాయన్నది ఇంకా స్పష్టత లేదనీ, పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే… నీరు సరఫరాపై ఆలోచించాలనీ ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దానిపై ఎలాంటి చర్చ లేదనీ, జిందాల్ నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందనీ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని సెలవులు పలువులు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నాయని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని బటన్ నొక్కుడు పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. కోటమి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేసే వైసీపీ నాయకులు గత ఐదేళ్లుగా ఈ విజయనగరం జిల్లాలో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని నిలదీశారు.

తాము చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేదు కనుక అధికారంలో ఉన్న మాపై పదేపదే బురద చల్లుతున్నారని తెలియజేశారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాలో ఎవరి హయాంలో ఏం జరిగిందో ఈ జిల్లా అభివృద్ధికి ఎవరు పాటుపడ్డారో చర్చ జరగాలనీ, జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మంత్రి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఇకనైనా ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని జిల్లా ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

Also Read : AP Police: రెంటపాళ్ల ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!