Shashi Tharoor: కాంగ్రెస్ నేత మురళీధరన్ పై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత మురళీధరన్ పై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అతన్ని పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్నామంటూ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ మురళీధరన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మురళీధరన్ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందిస్తూ… అలా చెప్పడానికి ఆయనకు పార్టీలో ఏ అధికారం ఉందని ప్రశ్నించారు.
Congress MP Shashi Tharoor Shocking Comments
మురళీధరన్ వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా… థరూర్ (Shashi Tharoor) స్పందిస్తూ… ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారం ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారికి పార్టీలో ఏ అధికారం లేదంటూ మురళీధరన్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. పలువురు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని, వాటిన్నింటికీ స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. వేరేవాళ్ల ప్రవర్తన గురించి తనను అడగొద్దని. తన గురించి మాత్రమే మాట్లాడతానని వ్యాఖ్యానించారు.
పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని థరూర్ పలుమార్లు ఉద్ఘాటించారు. దీనిపై మురళీధరన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్ తన తీరు మార్చుకునే వరకు తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమన్నారు. మాతో కలిసి లేరు కాబట్టి… ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలోనూ విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందు నిర్ణయించుకోవాలన్నారు.
Also Read : Drone Squadron: భారత్-పాక్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ‘డ్రోన్ స్క్వాడ్రన్’
