Zee TV : సరికొత్త ఆహ్లాదంతో జీ తెలుగు కొత్త వత్సర వేడుకలు
Zee TV : ఎందరో కళాకారులకు పుట్టినిల్లు గా నిలచిన జీ తెలుగు టివి... అనేక కార్యక్రమాలతో ఎంతోమంది తెలుగు అభిమానుల హృదయాల్ని గెలుచుకుని ఎంటర్టైన్ రంగంలో దూసుకుపోతోంది.
ఎందరో కళాకారులకు పుట్టినిల్లు గా నిలచిన జీ తెలుగు టివి… అనేక కార్యక్రమాలతో ఎంతోమంది తెలుగు అభిమానుల హృదయాల్ని గెలుచుకుని ఎంటర్టైన్ రంగంలో దూసుకుపోతోంది.
ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని కొత్త అనుభూతులతో మరియు ఒక కొత్త షోతో స్వాగతం పలకేందుకు సిద్దమైంది. ఈ కొత్త సంవత్సరాన్ని ‘పార్టీ కి వేళాయెరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. నాలుగు గంటల సేపు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో డిసెంబర్ 27 న తెలుగు ప్రజలందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి నూతన సంవత్సరాన్ని ఎంతో ఆహ్లాదంగా ఆహ్వానించేలా ఈ కార్యక్రమం రూపొందింది.
ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సీరియల్ యాక్టర్స్, స రి గ మ ప కంటెస్టెంట్స్ మరియు సద్దాం కలిసి 2020 గుడ్ బై పలికి తెలుగు టెలివిజన్ లోనే అతి పెద్ద కేక్ ని కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ న్యూ ఇయర్ ఈవెంట్ తో మొదలుపెట్టి , ‘బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 ‘ తో ముగించనుంది. జీ తెలుగు సిద్ధంగా ఉంది.
సెట్ డిజైన్, మునిపెన్నడు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో చూడని, వాడని ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులని మైమరింపించడానికి జీ తెలుగు సిద్దమవుతుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా, రసవత్తరంగా ఉండే ఈ షో కి నవరసాలని పలికించే సుమ కనకాల మరియు ఎనర్జిటిక్ యాంకర్ రవి హోస్టుగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకలో జీ తెలుగు కుటుంబానికి సంబందించిన నటులకు కొత్త రకమైన అవార్డ్స్ ఇవ్వనున్నారు. లేజీ లేడీ, స్లీపింగ్ స్పైడర్ అని ఫన్నీ అవార్డ్స్ బహుకరించునున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో జిటివి ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించే డేర్డెవిల్ యాక్ట్స్ పై సెలబ్రిటీలు పందెం వేస్తారు. తెలుగు టెలివిజన్ లోనే మునుపెన్నడు చూడని, వినని, కనని ప్రదర్శనలతోటి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసే ఈ వేడుక డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం కానుంది.
No comment allowed please