Mamata : తెలుగు ఓటు బ్యాంక్‌పై దీదీ దృష్టి

Mamata :ప‌శ్చిమ బెంగాల్‌లో రోజు రోజుకీ మారిపోతున్న రాజ‌కీయ‌ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  అధికార తృణమూల్ కాంగ్రెస్  కీలక నేతలను అక్కున చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ త‌న ప్ర‌య‌త్నాలు శ‌ర‌వేగం చేసింది. 

ప‌శ్చిమ బెంగాల్‌లో రోజు రోజుకీ మారిపోతున్న రాజ‌కీయ‌ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  అధికార తృణమూల్ కాంగ్రెస్  కీలక నేతలను అక్కున చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ త‌న ప్ర‌య‌త్నాలు శ‌ర‌వేగం చేసింది.  ఇప్పటికే సువేందు అధికారి సహా కొందరు ఎమ్మెల్యేలు. ఓ లోక్‌సభ సభ్యుడు కమలదళంలో చేరిపోవ‌టం కొంత ఆందోళ‌న క‌లిగించినా,  మ‌మ‌తా బెన‌ర్జీ   బీజేపీ వ్యతిరేక ఓటుబ్యాంకును మరింత కూడగట్టుకునే ప్రయత్నం ఆరంభించారు.

ఇప్ప‌టికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దించింది.  త‌మ పార్టీ నేత‌లను చేర్చుకునే క్ర‌మంలో దూకుడు ప్రదర్శిస్తోన్న బీజేపీ కి క‌ళ్లెం వేయ‌టంతో పాటు బీజేపీ వ్యతిరేకులు, తటస్థులు, వామపక్ష భావజాలం ఉన్న నేతలనూ త‌మ పార్టీ వైపు ఆక‌ర్షించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాడు ప్ర‌శాంత్ కిషోర్‌.  దీనికి తోడు అన్ని వర్గాలు, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి  స్థిరపడిన వారి ఓటర్ల వైపు కూడా దృష్టి సారించిన ప్ర‌శాంత్ కిషోర్ త‌న‌దైన మార్కు సూచ‌న‌లు ఇస్తున్నారు.తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్ లోని తెలుగు ప్రజలు గత కొన్నేళ్లుగా డిమాండ్ నెర‌వేర్చాల‌ని సూచించారు.

ఖరగ్‌పూర్, మేదినిపూర్, నారాయణ్‌పూర్, డాంటన్, ఎగ్రా వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇక్క‌డి గెలుపు ఓట‌ములకు వీరి ఓట్లే కీల‌కం . ఇక్క‌డి తెలుగు ప్రజల ఓటుబ్యాంకు కార‌ణంగానే గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మేదినిపూర్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందన్న‌ది నిజం.

ఈ క్ర‌మంలోనే ఇప్పటికే బెంగాల్‌లో 10 వరకు అధికార భాషలు ఉండ‌గా  తాజాగా తెలుగును అధికార భాషగా గుర్తించాల‌ని చేసిన సూచ‌న‌తో మమతా బెనర్జీ సారథ్యంలో  మంత్రివర్గం ఈ మేరకు నిర్ణ‌యం తీసుకుంది.  తెలుగును అధికారిక భాషగా గుర్తించడం ద్వారా తెలుగువారి   ఓటుబ్యాంకు తిరిగి పార్టీవైపుకు ర‌ప్పించుకునే వ్యూహ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

 

 

No comment allowed please