Nagababu : మెగా ఫ్యామిలీ ఇటీవలే ఎన్నో వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తెగ సందడి చేశారు. అంతేకాకుండా నిహారిక పెళ్లి సందడి నుంచి ప్రస్తుతం వరకు నాగబాబు సోషల్ మీడియాలో బాగా దర్శి స్తున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో సందడి చేసిన సందర్భాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన కొణిదెల నాగబాబు ప్రస్తుతం జీ తెలుగు అదిరింది షో లో చేస్తున్నాడు. జబర్దస్త్ షో లో కొన్ని కారణాల వల్ల షో కు దూరం కాగా.. జీ తెలుగు అదిరింది షో తో మళ్ళీ కామెడీను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జబర్దస్త్, అదిరింది షో కామెడీ టీమ్ లతో వేడుకలు జరుపుకున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా ఇటీవలే స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లకు నాగబాబు పార్టీ ఇవ్వగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అఖిల్, హారిక, లాస్య, సుజాత, నోయల్,అరియనా, మెహబూబ్, సోహెల్, అదిరింది కమెడియన్ లు, యాంకర్ రవి పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ పార్టీలో సుజాత పుట్టినరోజు వేడుకలు కూడా చేయించారు.
ఇదిలాఉంటే నాగబాబు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ల గురించి కొన్ని విషయాలు తెలిపారు. బిగ్ బాస్ మొదటి మూడు సీజన్లోకంటే బిగ్ బాస్ నాలుగో సీజన్ టాప్ ప్లేస్ లో ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులతో సహా అన్నీ వదులుకొని అందులో జర్నీ చేసినందుకు వాళ్ల గురించి కొన్ని విషయాలు మాట్లాడారు.ఈ బిగ్ బాస్ తరపున నుంచి మీరు మరింత ఎత్తుకు ఎదగాలని తెలుపుతూ.. అక్కడ జరిగిన సందడిలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
No comment allowed please