#CricketMindGame : కోట్లు కురిపిస్తున్న జెంటిల్మెన్ గేమ్

భార‌త్ అంటే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. ప‌సి పిల్ల‌ల నుంచి పండు ముదుస‌లి వాళ్ల దాకా కుల‌, మ‌తాలు, ప్రాంతీయ విభేదాలు, జాతుల వైరాల‌ను దాటుకుని క్రికెట్ విరాజిల్లుతోంది టెస్టులు, వ‌న్డే మ్యాచ్ లు, టి -20 క‌ప్ లు ఇలా ఆట ఆడ‌టం మారుతూ వ‌చ్చింది.

ఒక‌ప్పుడు క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అనే వారు. ఇపుడు ఆ ప‌దం పూర్తిగా మారింది. ఫార్మాట్ కూడా ఛేంజ్ అయింది. వ‌ర‌ల్డ్ ను ఫుట్ బాల్ ఊపేస్తందనుకుంటే..అనూహ్యంగా దాని ప్లేస్ ను 11 మంది ఆట‌గాళ్లు ఆడే క్రికెట్ పూర్తి చేసింది. బంతికి బ్యాట్ కు మ‌ధ్య న‌డిచే యుద్ధం..ఫోర్ ..సిక్స‌ర్ కు మ‌ధ్య ఉండే టెన్ష‌న్ జ‌నాన్ని ఒక చోట ఉండ‌నీయ‌కుండా చేసేసింది. ఇండియా అన్నా ఆట‌ల‌న్నా గుర్తుకు వ‌చ్చేది హాకీనే. ఎప్పుడైతే మైదానంలో హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌ధ్యంలో ప్ర‌పంచ క్రికెట్ క‌ప్ ను 1983లో సాధించి తీసుకు వ‌చ్చాడో ఇక అప్ప‌టి నుంచి నేటి దాకా భార‌త్ అంటే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. ప‌సి పిల్ల‌ల నుంచి పండు ముదుస‌లి వాళ్ల దాకా కుల‌, మ‌తాలు, ప్రాంతీయ విభేదాలు, జాతుల వైరాల‌ను దాటుకుని క్రికెట్ విరాజిల్లుతోంది టెస్టులు, వ‌న్డే మ్యాచ్ లు, టి -20 క‌ప్ లు ఇలా ఆట ఆడ‌టం మారుతూ వ‌చ్చింది.
ఆట ప‌రంగా ర‌క్ష‌ణాత్మ‌కంగా ఆడినా క్రికెట్ ప్రేమికులు..అభిమానులు..ఆరాధ‌కులు త‌ట్టుకోలేక పోతున్నారు. ప్ర‌తి బాల్ ను నాలుగో లేదా సిక్స‌రో కొట్టాల్సిందేనంటూ కేరింత‌లు కొడుతున్నారు. ఈ దేశంలో జాతీయతా భావం ఏదైనా ఉందంటే ..కోట్లాది ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం జాతీయ ప‌తాకం ఎగ‌రే అరుదైన దృశ్యాల‌ను చూడాలంటే మైదానంలో ఇండియా ఇత‌ర జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌లు చూడాల్సిందే. ఇండియాకు క‌పిల్ ఒక ఊపు తీసుకు వ‌స్తే..హైద‌రాబాద్ గ‌ల్లీ బాయ్ మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ సార‌థిగా వ‌చ్చాక రూపు రేఖ‌లు మారి పోయాయి. అటు టెస్టుల్లోను ఇటు వ‌న్డేల్లోను భార‌త జ‌ట్టు అరుదైన విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల నుంచి ఆట‌గాళ్లు ప్ర‌ధాన జ‌ట్టులోకి రావ‌డం మొద‌లైంది.
అప్ప‌టి దాకా ముంబ‌యి క్రికెట‌ర్ల ఆధిప‌త్యం ఉండేది. అజ్జూ భాయ్ వ‌చ్చాక తుడిచి పాడేశాడు. ఇవాళ బిసిసిఐ సార‌ధిగా ఉన్న గంగూలీ అంద‌రూ ముద్దుగా పిలుచుకునే దాదా ఆయ‌న కాలంలోనే జ‌ట్టులోకి వ‌చ్చాడు. త‌ను కూడా కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టీకీ ఈ ఆట‌గాడికి అజ‌హ‌రుద్దీన్ అంటే ఎన‌లేని ప్రేమ‌. ఎంద‌రో ఆణిముత్యాలు తెర మీద‌కు వ‌చ్చారు. మ‌రికొంద‌రు మ్యాచ్ ఫిక్సింగ్ భూతం దెబ్బ‌కు కెరీర్ ను కోల్పోయారు. అందులో మ‌నోడు మొద‌టి వాడు. ఇక వ‌న్డే ఫార్మాట్ లో అనూహ్య‌మైన మార్పు చోటు చేసుకుంది. అదే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్. ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌ట్ల నుంచి ఆట‌గాళ్ల‌ను వేలం ప‌ద్ధ‌తిలో తీసుకుని ఆడేలా చేయ‌డం. కార్పొరేట్ కంపెనీలు, బిలియ‌నీర్లు, వ్యాపార‌వేత్త‌లు, క్రికెట్ ప్రేమికులు ఫ్రాంచైజీలుగా ఏర్ప‌డి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు.
ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన ఢిల్లీ, కొల్‌క‌త్తా, చెన్నై, బెంగ‌ళూరు, జైపూర్, అహ్మ‌దాబాద్, నాగ్ పూర్, కొచ్చిన్, హైద‌రాబాద్, వైజాగ్ ఇలా వీలైనంత వ‌ర‌కు ప్ర‌తి చోటా ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా కోవిడ్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అభిమానులు లేకుండానే దుబాయి కేంద్రంగా ఐపీఎల్ టోర్న‌మెంట్ జ‌రిగింది. రికార్డు స్థాయిలో వ్యూవ‌ర్ షిప్ రావ‌డం అటు బిసిసిఐ పెద్ద‌ల‌ను ఇటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. మ‌రో వైపు ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తూ వ‌స్తున్న అమెరికా సైతం క్రికెట్ కు ఉన్న ఫీవ‌ర్ ను ..ఆద‌ర‌ణ‌ను..క్రేజ్ ను చూసి పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. అక్కడ టెన్నిస్, వాలీబాల్, చెస్, గోల్ఫ్ ఆట‌ల‌కు ప్ర‌యారిటీ. మ‌న‌వాళ్లు యుఎస్ లో ఎక్కువ‌గా ఉండ‌డంతో క్రికెట్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంది. మ‌రో వైపు నిన్న‌టి దాకా క్రికెట్ టెలికాస్ట్ హ‌క్కుల‌ను స్వంతం చేసుకున్న ఇంట‌ర్నేష‌న‌ల్ దిగ్గ‌జ సంస్థ సోనీకి స్టార్ట టీవీ గ్రూపు చుక్క‌లు చూపించింది.
ప్ర‌పంచంలో ఏ ఆట‌కు లేనంత‌గా ఇండియ‌న్ గవ‌ర్న‌మెంట్ ఆధ్వ‌ర్యంలో బిసిసిఐ పిలిచిన ప్ర‌సార హ‌క్కుల కోసం బిడ్డింగ్ లో 1665 కోట్ల‌కు చేజిక్కించుకుంది. వ‌ర‌ల్డ్ ఒక్క‌సారిగా ఔరా అని ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఎప్పుడైతే జీటీవి గ్రూపు నుంచి రిజైన్ చేసి స్టార్ టీవీ గ్రూపున‌కు సిఇఓగా ఉద‌య్ శంక‌ర్ వెళ్లాడో అపుడే దాని రూపు రేఖ‌లు పూర్తిగా మార్చేశాడు. ఇండియ‌న్ స్పోర్ట్స్ హిస్ట‌రీలో ఈ వేలం పాట మ‌రో మైలు రాయిగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ దేశంలో అత్యంత సుసంప‌న్న‌మైన..ఆదాయం ఎక్కువ‌గా ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది బిసిసిఐనే. మ‌న‌కు 10 ఏళ్లు క‌రువు వ‌చ్చినా దానిని తీర్చే స‌త్తా దీనికే ఉందంటే న‌మ్మ‌గ‌ల‌మా. త‌ప్ప‌దు..ఆయా కంపెనీలు క్రికెట్ మ్యాచ్ ల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేందుకు పోటీ ప‌డుతున్నాయి. స్పాన్స‌ర్ షిప్ తీసుకునేందుకు క్యూ క‌ట్టాయి. నిన్నటి దాకా కోవిడ్ దెబ్బ‌కు ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్‌లు చేప‌ట్టిన బిసిసిఐ తాజాగా ఐపీఎల్ ప్రేమికుల‌కు తీపి క‌బురు చెప్పింది. నిబంధ‌న‌లు పాటిస్తూనే మ్యాచ్ లు చూసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం మీద ఇండియా అంటేనే క్రికెట్ ..క్రికెట్ అంటేనే భార‌త్ అని అనుకుంటున్నారు.

No comment allowed please