#CubaCastro : గుండె నుంచి గుండెల్లోకి క్యూబా మోహన రాగం

అమెరికా ప‌క్క‌లో బ‌ల్లెం క్యూబా

Cuba Castro: ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని, పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా పక్కలో బల్లెం లా తయారైన క్యూబా పేరు తలుచుకున్నప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు రోమాలు పైకి లేస్తాయి. శరీరంలో ఏదో విద్వత్తు ప్రవహిస్తుంది. క్యూబా ..కాస్ట్రో ..చేగువేరా ..గుండెల్లో కదలాడుతూనే వుంటారు. ఎందుకంటే చూస్తే చిన్న దేశం. కానీ యుఎస్ కు ముచ్చెమటలు పట్టించిండ్రు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అమెరికా ఇప్పటికీ కాస్ట్రో(Cuba Castro) పేరు తలుచుకుని భయ పడుతోంది. అంతేనా ప్రభావితం చేస్తూ నియతం వెంటాడుతున్న ఒకే ఒక్కడు చేగువేరా. ఉద్విగ్న మైన చరిత్రకు, పోరాటాలకు ఊపిరి పోసిన చరిత్ర క్యూబాది.

అందుకే ఆ దేశమన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి. ఈ లోకంలో ఎందరో హీరోలయ్యారు. ఇంకొందరు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసారు. జనం గుండెల్లో రాజులయ్యారు. మహారాజులై కీర్తింప బడుతున్నారు. ఏళ్ళు గడిచినా , కాలం వెళ్లి పోతున్నా, సాంకేతికత కొత్త పుంతలు తొక్కినా , పోగేసుకున్న చరిత్ర అలాగే ఉన్నది. పాడు కోవడానికో లేదా గుర్తు తెచ్చు కోవడానికో కాదు..కోట్లాది ప్రజల ఆర్త నాదం. క్యూబా గురించి ..కన్నడ నాట గొప్ప రచయితగా పేరొందిన జి.ఎస్. మోహన్. నాలోని రాగం క్యూబా పేరుతో రాసిన పుస్తకం. దేశం లోనే ఈ పుస్తకం సంచలం కలిగించింది.

గుండె నుంచి గుండెల్లోకి ప్రవహించేలా రాసారు ఆయన. ఎంతో ఆదరణ పొందిన ఈ పుస్తకానికి కర్ణాటక ప్రభుత్వం సాహిత్య అకాడెమీ అవార్డును ప్రకటించింది. మరి కొన్ని భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. కన్నడ భాష నుంచి తెలుగులోకి సృజన్ అనువదించారు. రచయిత ఆత్మలోకి ప్రవేశించారు. జీవితంలో తిరిగి జ్ఞాపకం చేసుకునేలా రాశారు మోహన్. కేవలం వంద రూపాయలు ఉన్న ఈ పుస్తకం మనల్ని మనుషుల్ని చేస్తుంది. ఎంతలా అంటే అభిమానించేంత..గుండెల్లో దాచుకునేంతగా. పుస్తకం చదువుతున్నంత సేపు క్యూబాలో ప్రయాణం చేస్తున్నట్టుగా .. ఆ దేశపు మైదానం మీద ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది.

గాయ పడ్డ దేశాన్ని, ఆ గాయాన్ని ఆయుధంగా మలుచుకుని విజేతగా నిలిచిన క్యూబా (Cuba Castro)గురించి రచయిత మహోన్నతంగా రాశాడు. ఏ దేశమైనా మట్టి అంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే . ప్రవహించే రక్తం కూడా ఒక్కటే. అంతరాలు అన్నింటా ఉన్నా..క్యూబా ఒక్కటే ఎలా అమెరికాను ఎదుర్కోగలిగిందో తెలుసు కోవాలంటే ..తెలుసుకోవాలి. వెదకాలి.ప్రతి ప్రయత్నం గొప్పదే కానక్కర్లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ మట్టి మాదవుతుంది . ఈ గాలి ..ఈ స్వచ్ఛత మాతోనే వుండి పోతుంది ..అంటారు అక్కడి జనం. వారి మీద వారికున్న నమ్మకం..ప్రేమ అలాంటింది. ”గ్వంతన మేర గ్వంతన మేర” అంటూ క్యూబా ప్రజలు ఆడుకుంటూ, పాడుకునే పాట.

తన అస్థిత్వాన్ని కాపాడుకునే క్రమంలో చేసిన తిరుగుబాటు ప్రపంచానికే ఆదర్శం. అగ్ర రాజ్య పీడనను తన ముందు తరానికి కలలో కూడా రాకుండా చేసుకుంది ఆ దేశం. అమెరికా చెప్పేది వేరు. కానీ ఆ దేశంలో కాలు మోపితే.. క్యూబాని ప్రేమిస్తారు .. హత్తుకుంటారు. ఆతిథ్యమే కాదు వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు పలికే ఆ దేశ ప్రజల హృదయాలను ఆవిష్కరించిన తీరు ప్రసంశనీయం. “ప్రతి నిమిషాన్ని గుండెల్లోకి దాచుకునే దేశం అది. ఒక చిన్న భరిణెను తెచ్చాను. అందులో కాస్తంత మట్టి, నీరు, గాలి.” మాత్రమే ఉన్నాయి అంటారు మోహన్. నిజం కదూ ..దేశంనుంటే మట్టి కదూ.

No comment allowed please